సమంత యూరప్ నుంచి తిరిగి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్ళిన సమంత షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. అలా వచ్చిన ఈ భామ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
హారీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత కాగా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాని సెప్టెంబర్ లో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని చాలా కొత్తగా, పవర్ఫుల్ గా కనిపించనున్నాడని అందరూ ఆశిస్తున్నారు.