కార్తీక్ సుబ్బరాజు ఇటీవల చిత్రం “పిజ్జా” తమిళంలో విడుదల అయ్యి ఘన విజయం సాదించింది. 2012లో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఈ చిత్రం ఒకటి. ఈ చిత్రాన్నిపారిస్ లో సౌత్ ఏషియన్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న దర్శకుని పేరు కార్తీక్ సుబ్బరాజు. విజయ్ సేతుపతి మరియు రెమ్య నంబీసన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. పలువురు సెలబ్రిటీ లు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. తాజాగా అందాల భామ సమంత ఈ చిత్రాన్ని చూసి ప్రశంసలలో ముంచెత్తారు.”ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి చిత్రాలలో పిజ్జా ఒకటి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం చాలా బాగుంది విజయ్ సేతుపతి మరియు రెమ్య నంబీసన్ కూడా చాలా బాగా నటించారు” అని చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఫిబ్రవరి 15న తెలుగులో విడుదల కానుంది.