ఏటో వెళ్ళిపోయింది.. నేను డబ్బింగ్ చెప్పలేదు.!

తెలుగు సినిమా రంగంలో వరుస హిట్లు అందుకుంటూ ఫుల్ స్వింగ్ మీదున్న హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత తన రాబోయే సినిమాలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుతం గౌతం మీనన్ డైరెక్షన్లో రానున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంది. తెలుగులో ఆమె వాయిస్ వినడానికి ఆమె అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కానీ అనుకున్నట్టుగా సమంత ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం లేదు. ‘ ఎటో వెళ్ళిపోయింది మనసుకి డబ్బింగ్ చెప్పడం లేదు, ట్రైలర్స్ లో మాత్రమే నా వాయిస్. నా వాయిస్ తో రిస్క్ చేయదలుచుకోలేదు మరియు చిన్మయి అభిమానులను నిరుత్సాహపరచదలుచుకోలేదని’ సామంత ట్వీట్ చేసారు.

ఇప్పటి వరకూ సమంత మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమా నుంచి ‘ఈగ’ వరకు సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ప్రేక్షకులందరూ సమంత అంటే చిన్మయి వాయిస్ కి ఫిక్స్ అయ్యారు అందుకే డైరెక్టర్స్ రిస్క్ తీసుకో దలుచుకోలేదు. నాని, సమంత జంటగా నటించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version