వైరల్ అవుతున్న…చిట్టి సమంత క్యూట్ ఫోటో.

హీరోయిన్ సమంత తన చిన్ననాటి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. చిన్న వయసులో కుటుంబ సభ్యులతో కలిసి తీయించుకున్న ఫొటోను సమంత అభిమానులతో పంచుకుంది. అందులో చిన్నారి సమంతతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. ‘మనం వేర్వేరు మార్గాల్లో పెరిగి పెద్దయ్యాం. కానీ, మన మూలాలు మాత్రం ఒకటే. మిమ్మల్ని మిస్సవుతున్నా` అని సమంత కామెంట్ చేసింది. రెండు గంటల్లోనే ఈ ఫొటో 4 లక్షలకు పైగా లైక్ లు రావడం గమనార్హం.

వాళ్ళ అమ్మ చంకలో చిట్టి సమంత చాలా క్యూట్ గా ఉంది. ప్రస్తుతం సమంత హీరోయిన్ నయనతారతో కలిసి ఓ తమిళ మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు విగ్నేష్ శివన్ అని సమాచారం. అలాగే సమంత సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో నటిస్తుంది.

Exit mobile version