ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసిన నటి సమంత

ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేసిన నటి సమంత

Published on Aug 31, 2013 1:46 PM IST

rajitha_invoice

నటి సమంత మరోసారి సహాయం చేసి తన దయ గుణాన్ని తెలియజేసింది. కొద్ది రోజులకు ముందు దిల్ సుక్ నగర్ బాంబు బ్లాస్ట్ లో కాలును పోగొట్టుకున్న ఎంబీఎ విద్యార్థిని రజితకు ఆమె ఫ్యాన్ రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సమంత స్వయంగా ఆ చెక్ ను ఆమెకు అందజేసింది. అప్పుడు తను కూడా తనకు సహాయం చేస్తానని ప్రామిస్ చేసింది. ఈ అందాల తార తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. రజితకు సమంత ఆర్ధిక సహాయాన్ని అందజేసింది. ఆమె రూ. 2,30,000లను కృతిమ కాలు కోసం రజితకు అందజేసింది. ఈ చెక్ ను సమంత తన ఫాన్స్ ద్వారా అందజేసింది. రజితకు కృత్రిమ కాలుకు కావలసిన కార్యకమలను ముగిశాయి.

ఈ సహాయం చేసి సమంత వారి మనసులో నిలిచిపోయింది.

తాజా వార్తలు