బాలీవుడ్ బాక్స్ ఆఫీసు బాద్ షా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎక్ థా టైగర్’ సినిమా గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో తీసిన స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లకి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకి చేసిన అదే టీం సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు.
ప్రస్తుతం ఈ ఫైట్ మాస్టర్ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తున్నారు, ఇందులో మహేష్ బాబు కూడా పాల్గొంటున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని ఆశించవచ్చు.