బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక్క సాలిడ్ హిట్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ తో చేసిన సికందర్ అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేదు. దీనితో ఫ్యాన్స్ నెక్స్ట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలా తన నెక్స్ట్ సినిమా అలానే హిందీ బిగ్ బాస్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఫిట్నెస్ పరంగా ఎలా ఉంటాడు అనేది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో 6 ప్యాక్ లాంటివి ఎప్పుడో పరిచయం చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు తనకి 59 ఏళ్ల వయసొచ్చినా కూడా అదే రేంజ్ లో మైంటైన్ చేస్తుండడం చాలామందికి షాకింగ్ అని చెప్పాలి.
లేటెస్ట్ గా వదిలిన తన వర్కౌట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికీ అదే దృఢమైన ఫిజిక్ ని మైంటైన్ చేస్తూ సల్మాన్ ఫ్యాన్స్ కి మరోసారి ట్రీట్ అందించాడు. ఇలా సోషల్ మీడియాలో ప్రస్తుతం తన పిక్స్ వైరల్ గా మారాయి.
