మితిమీరిన ఎక్స్ పోజింగ్ కి నో అంటున్న సాక్షి

మితిమీరిన ఎక్స్ పోజింగ్ కి నో అంటున్న సాక్షి

Published on Sep 2, 2013 9:17 PM IST

sakshi

మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమా ‘పోటుగాడు’. ఈ సినిమా ద్వారా సాక్షి చౌదరి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది. 2011లో గ్లాడ్ రాగ్స్ మెగా మోడల్ గా ఎంపికైన ఈ భామకి హీరోయిన్ గా ఇదే మొట్ట మొదటి సినిమా. ‘పోటుగాడు సినిమాలో ముస్లీం యువతిగా కనిపించనున్న ఈ భామని గ్లామర్ రోల్స్, ఎక్స్ పోజింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగితే ‘ గ్లామర్ రోల్స్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గ్లామర్ విషయంలో క్యారెక్టర్ కి ఎంత అవసరం అంతవరకూ నాకు ఓకే కానీ మితిమీరిన ఎక్స్ పోజింగ్ అంటే నాకు నచ్చదని’ సాక్షి చౌదరి సమాధానం ఇచ్చింది.

పవన్ వడేయార్ దర్శకత్వం వహించిన ‘పోటుగాడు’ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష లగడపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి చౌదరితో పాటు సిమ్రాన్ కౌర్ ముండి, అను ప్రియ గోయెంక, రేచల్ కూడా హీరోయిన్స్ గా తెరపంచుకోనున్నారు. ఈ సినిమాతో సాక్షికి మంచి పేరు, ఆఫర్లు రావాలని ఆశిద్దాం..

తాజా వార్తలు