ఫుల్ స్పీడ్ మీద ఉన్న పూరి తమ్ముడు

తన కెరీర్ ని విజయపథంలో నడిపించడానికి సాయిరాం శంకర్ సకలవిధాల కష్టపడుతున్నారు. ప్రస్తుతం అయన కొద్ది వారాల్లో రానున్న “యమహో యమ” మరియు “రోమియో” చిత్రాల మీదనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇది కాకుండా తేజ దర్శకత్వంలో “వెయ్యి అబద్దాలు” చిత్రానికి మరియు జయ రవి చంద్ర చిత్రంలో నటిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈయన కొత్త దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో ఒక చిత్రానికి సంతకం చేసినట్లు తెలుస్తుంది. సంతోష్ గతంలో రాఘవేంద్ర రావు దగ్గర సహాయకుడిగా పని చేశారు.ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూరి రాసిన ప్రేమ కథ అంటూ వస్తున్న “రోమియో” మీదనే అందరి కళ్ళు ఉన్నాయి ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథ అందించడం ఈ అంచనాలకు కారణం. ఈ నెలలోనే “రోమియో” విడుదల కానుంది.

Exit mobile version