సరికొత్త పెళ్లి శుభలేఖ..!

సరికొత్త పెళ్లి శుభలేఖ..!

Published on Jul 31, 2012 3:23 PM IST


టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మాన్ పాత్రల్లో కనిపించి ‘అగ్ని’ గా తెలుగు వారి మనస్సులో నిలిచిపోయిన హీరో సాయి కుమార్. తన నటనతోనే కాకుండా ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్పి తన వాయిస్ తో కూడా తెలుగు వారిని ఆకట్టుకున్నారు. సాయి కుమార్ కుమార్తె జ్యోతిర్మయి పెళ్లి కృష్ణ ఫల్గుణ అనే అబ్బాయితో నిశ్చయమైంది. ఆగష్టులో వీరి వివాహ మహోత్సవం జరగనుంది. ఈ పెళ్లి రిసెప్షన్ ఆగష్టు 9న హైదరాబాద్లో జరగనుంది. ఈ పెళ్ళికి సంభందించిన ఆహ్వాన పత్రికను సాయి కుమార్ చాలా ప్రత్యేకంగా రూపొందించారు. ఆ పెళ్లి శుభలేఖ మీతో మాట్లాడుతుంది, పెళ్లి శుభలేక మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.! అవునండి పెళ్లి శుభలేఖ ఓపెన్ చెయ్యగానే ‘కుటుంబ సమేతంగా పెళ్ళికి రండి, రాకపోతే ఊరుకోను’ అనే వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ మరెవరిదో కాదండి మన సాయి కుమార్ గారిదే. ఇక్కడ మాత్రం సీరియస్ గా డైలాగ్ చెప్పలేదండోయ్ ఎంతో ప్రేమతో చెప్పారు. తన కూతురి పెళ్లి శుభలేఖని ఇలా కొత్తరకంగా తయారుచేసి ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుకొన్నారు.

పెళ్లి ఖరారు కాగానే కొత్తగా ఆలోచించి ‘ముందస్తు పెళ్లి కబురు’ అని ఒక ఆహ్వానాన్ని ఇచ్చారు. అలాగే పెళ్లి శుభలేఖను కూడా అంతే కొత్తగా రూపొందించారు. ఇలా మాట్లాడే శుభలేఖని టాలీవుడ్లో తయారు చేయడం బహుశా ఇదే ప్రధమం అనుకుంటా.

తాజా వార్తలు