చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మతేజ్ రెండవ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నడన్న విషయన్ని ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సాయి ధర్మతేజ్ భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గొంటున్నాడని తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముగిసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి దర్మతేజ్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రెజీన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు – హర్షిత్ నిర్మిస్తున్నారు. అనుప్ రుబీన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో శ్రీ హరి, జయప్రకాష్ రెడ్డి, చంద్రమోహన్ లు నటిస్తున్నారు.