గోపీచంద్ హీరోగా చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన సినిమా ‘సాహసం’. ఈ సినిమాని ఇంతకు ముందు జూలై 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా విడుదలని జూలై 12కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా పి.ఆర్.ఓ తెలియజేశాడు. కొత్త నేపథ్యంతో, సూపర్బ్ విజువల్స్ తో నిర్మించిన ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం చంద్రశేఖర్ యేలేటి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ సంగీతాన్ని అందించాడు.