తమిళ్ మరియు తెలుగు చిత్ర రంగంలో ప్రస్తుతం చాలా బిజీ సంగీత దర్శకుడు మన ఎస్.ఎస్ థమన్. మాస్ బీట్స్ కావాలనుకునే దర్శకనిర్మాతల మొదటి ఎంపిక థమన్ అనడంలో అతిశయోక్తి లేదు. మాస్ బీట్స్ అందించడంలో థమన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిఏర్పరుచుకున్నాడు.
మాస్ సెగ్మెంట్ లో విజయవంతంగా కొనసాగుతున్న థమన్ కి ఒక కోరిక వుంది. అవకాశం వస్తే రొమాంటిక్ చిత్రాలకి మెలోడి ట్యూన్ లు అందించాలని వుంది కాని నన్ను చాలా మంది మాస్ బీట్స్ కోసమే సంప్రదిస్తున్నారు అని ఇటివలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. చాలా సందర్భాలో అనేక మంది నటులు, దర్శకులు థమన్ అందించిన నేపద్య సంగీతాన్ని మెచ్చుకున్నారు. థమన్ తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలా చక్కగాఉపయోగించుకున్నాడు
.
ప్రస్తుతం ఎన్.టీ.ఆర్. ‘రభస’ చిత్రం కోసం వీరిద్దరూ మ్యూజిక్ సెషన్స్ లో పాల్గొన్నారు. భవిష్యతులో థమన్ ఎలాంటి ట్యూన్స్ తో ముందుకు వస్తాడో వేచి చూడాలి.