ఎం ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న “RUM” చిత్రం ప్రధాన భాగ చిత్రీకరణ మస్కట్ లో త్వరలో మొదలుకానుంది. “RUM ” అంటే రంభ, ఊర్వశి, మేనక అని దర్శకుడు తెలిపారు. త్రిష, నికిషా పటేల్ మరియు ఇషా చావ్లాలు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రంలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్టు తెలుస్తుంది ఈ సన్నివేశాలన్నింటిని ఫైట్ మాస్టర్ విజయన్ పర్యవేక్షణలో తెరకెక్కించనున్నారు. కెరీర్ ఆరంభంలో “వర్షం” మరియు “నువ్వొస్తానంటే నేనోద్దంటానా” వంటి చిత్రాల కోసం ఎం ఎస్ రాజు తో కలిసి పని చేసిన త్రిష చాలా రోజుల తరువాత అయన చిత్రంలో నటిస్తున్నారు. ఇషా చావ్లా మరియు నికిషా పటేల్ లు ఎం ఎస్ రాజు చిత్రంలో చెయ్యడమ ఇదే మొదటిసారి. గతంలో పూర్ణ ను ఎంపిక చేసున్న పాత్రలో ఇషా చావ్లా నటిస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.