ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘రొమాన్స్’ చిత్రం సందడి చేయ్యనుంది. ‘ఎవడు’ సినిమా అనుకోకుండా వాయిదాపడడంతో చిత్ర బృందం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సినిమాను ఈ సమయంలో విడుదలచెయ్యడానికి నిశ్చయించారు
‘డార్లింగ్’ స్వామి ఈ సినిమాకు దర్శకుడు. మారుతి సమర్పిస్తున్న ఎ సినిమాను గుడ్ సినిమా గ్రూప్ సంస్థ నిర్మించింది
ప్రిన్స్ ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు. డింపుల్ మరియు మానస హీరోయిన్స్. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించాడు. ఈ రోజుల్లో యువత మనస్తత్వ ధోరణిని ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించారు