టాలివుడ్లోకి రానున్న మరో బ్రెజిల్ భామ

నటాలియ కౌర్, రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన ఈ బ్రెజిల్ భామ “డిపార్టుమెంటు” చిత్రంలో ఐటం పాటకు నృత్యం చేసింది ఈ పాట దాదాపు ఒక నెల పాటు ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవి చూసింది తరువాత రామ్ గోపాల్ వర్మ తన తరువాత చిత్రాన్ని మొదలు పెట్టారు నటాలియ కౌర్ కి అవకాశాలు రాకుండా పోయింది. కొన్ని ఈవెంట్స్ లో కనిపించడమే కాని తెర మీద కనిపించలేదు. ఇప్పుడు తెలుగులో రెండు చిత్రాలను చేయ్యనున్నట్టు ఈ భామ ఒక ప్రముఖ పత్రికతో తెలిపింది. టాలీవుడ్ తో ప్రేమలో పడ్డట్టు ఈ భామ తెలిపింది ఇప్పటికే ఇక్కడ గాబ్రియేలా బెర్తంతే ఇక్కడ “దేవుడు చేసిన మనుషు” చిత్రంలో ఐటం సాంగ్ మరియు “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో ఒక పాత్రను దక్కించుకోవడంతో నటాలియ కౌర్ కూడా ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటుంది.

Exit mobile version