‘ఐతే’ను మెచ్చుకున్న మొదటివ్యక్తి రామ్ గోపాల్ వర్మ: చంద్రశేఖర్ యెలేటి

‘ఐతే’ను మెచ్చుకున్న మొదటివ్యక్తి రామ్ గోపాల్ వర్మ: చంద్రశేఖర్ యెలేటి

Published on Sep 8, 2013 6:50 PM IST

rgv

ఈ కాలం దర్శకులకు మేవరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక రూపంలో గురువులా పాఠాలు నేర్పుతూ, సహాయం చేస్తూనేవుంటాడు. అందులో ఒకటి ఈ ‘ఐతే’ సినిమా విడుదలవ్వడానికి వెనకున్న కధ.’ఐతే’ సినిమా షూటింగ్ పూర్తయినా ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకురాలేదు. అప్పుడు ఆర్.జి.వి ఈ సినిమాను చూసి తనకు బాగానచ్చిందని మెచ్చుకోవడంతో బయ్యర్లు
ఈ సినిమాపై దృష్టిసారించారు.

ఇప్పుడు ఆగ్ర టెక్నీషియన్స్ గా పిలవబడుతున్న చాలామంది ఈ సినిమాద్వారానే టాలీవుడ్ కు పరిచయమయ్యారు. దర్శకుడు చంద్రశేఖర్ యెలేటికి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కి, కళా
దర్శకుడు రవీందర్ కు, సంగీతదర్శకుడు కళ్యాణిమాలిక్ కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలను పొందటమేకాక వసూళ్లపరంగా కూడా హిట్ గా నిలిచింది.

తాజా వార్తలు