బాస్టర్డ్.. భార్యను కూడా బాధితురాలిని చేశాడు – వర్మ

బాస్టర్డ్.. భార్యను కూడా బాధితురాలిని చేశాడు – వర్మ

Published on Feb 2, 2020 2:20 PM IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ.. తెరకెక్కిస్తోన్న సినిమా ‘దిశ’: గత ఏడాది నవంబర్ లో హైదరాబాద్ లో జరిగిన దిశా అత్యాచారం, మర్డర్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రేపిస్టులు దిశాని దారుణంగా సజీవ దహనం చేయడంతో ప్రజలంతా విచారంతో పాటు ఆగ్రహావేశాలతో రగిలిపోయారు.

కాగా ఇప్పుడు ఈ బాధాకరమైన ఘటన పై వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను ఆర్జీవీ ఈ రోజు ఉదయం కలిశారు. నిందితుడు చెన్న కేశవులు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వర్మ ఆమెను సంప్రదించారట.

అయితే ఈ సందర్భంగా వర్మ నిందితుడు చెన్నకేశవులు గురించి పోస్ట్ చేస్తూ.. ‘రేణుక 16 సంవత్సరాల వయసు ఉండాగానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిని చేశాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుంది’ అని వర్మ పోస్ట్ చేశాడు.

తాజా వార్తలు