హర్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చేసిన హర్రర్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం వర్మ ఆ హర్రర్ జోనర్ ని వదలదలుచుకోవడం లేదు. ప్రస్తుతం వర్మ రెండు సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నాడు.
ఆ రెండిటిలో ఒకటి హర్రర్ మూవీ. ఈ మూవీకి ‘పట్ట పగలు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. వర్మ ఈ సినిమాని 30 రోజుల్లో కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఆయన ఇంకో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నాడని సమాచారం. ఈ సినిమాకి ‘బ్రూస్ లీ’ అంటే టైటిల్ పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మకి ‘గుడ్ లక్’ చెబుతున్నాం..