జనవరి మొదటి వారంలో రేయ్ ఆడియో?

Rey
వైవిఎస్ చౌదరి గత రెండు సంవత్సరాలుగా తెరకెక్కించిన ‘రేయ్’ సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. వైవిఎస్ చౌదరి ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర టీం న్యూస్ చానల్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో జనవరి మొదటి వారంలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. కానీ ఆడియో రిలీజ్ ఎక్కడ జరుగుతుంది, కచ్చితమైన డేట్ అనే విషయాలను అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

చిరంజీవి మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే వైవిఎస్ చౌదరి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒక కీలకమైన పార్ట్ ని అల్లు అర్జున్ డైరెక్ట్ చేసాడు. ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో 8 నిమిషాల పాట ఒకటి ఉంటుంది. అది షూట్ చేసే సమయంలో అల్లు అర్జున్ రేసు గుర్రం షూటింగ్ కూడా అదే లొకేషన్ లో జరుగుతోంది. ‘అలా ఒక రోజు మా సెట్స్ కి వచ్చిన బన్ని సాయి ధరమ్ తేజ్ ని డైరెక్ట్ చేసాడు. మేము అది చూసి ఎంతో థ్రిల్ అయ్యామని’ వైవిఎస్ అన్నాడు.

కరేబియన్ ఐల్యాండ్ లో జరిగే ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ సినిమాకి చక్రి మ్యూజిక్ అందించాడు. ఈ సారి వైవిఎస్ విజయం అందుకుంటాడేమో చూద్దాం..

Exit mobile version