పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే “పింక్’ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో పిరియాడిక్ మూవీ చేస్తున్నాడు. తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌ని కూడా అర్జంటుగా ట్రాక్ ఎక్కించాడట. ఇక నుండి కూడా రీమేక్ కథలు తీసుకురమ్మని పవన్ దర్శకులకు చేబుతున్నాడట. అలాగే హరీష శంకర్ దర్శకత్వంలోనూ మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.
ఇక పవన్ 2022లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉండటంతో దర్శకుడు డాలీతో కూడా పవన్ ఒక సినిమా చేసే అవకాశం ఉంది. కాగా డాలీ దరకత్వంలో సినిమా చేయడానికి పవన్ నుండి సానుకూల స్పందన వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయట. అంటే వకీల్ సాబ్ కాకుండా పవన్ నుండి మరో నాలుగు సినిమాలు రాబోతున్నాయి అన్నమాట.