చూడటానికి ఆరడుగులు పొడవుండి బలంగా కనిపించే అడవి శేష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కిస్’. ఈ సినిమాని ఈ నెల 13న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అడవి శేష్ తెలియజేశారు. ఈ మూవీ లో అడవి శేష్ సరసన ప్రియా బెనర్జీ హీరోయిన్ గా కనిపించనుంది. చాలా రోజుల క్రితమే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమాకి సరైన రిలీజ్ టైం దొరక్కపోవడంతో కొద్ది రోజులు వాయిదా వేసారు. ఈ మూవీలోని చాలా భాగం సాన్ ప్రాన్సిస్కో లో షూట్ చేసారు. సాయి కిరణ్ అడవి నిర్మించిన ఈ సినిమాకి సాయిచరణ్ పాకల – పేటె వండర్ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అడవి శేష్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం అడవి శేష్ రాజమౌళి తీస్తున్న బాహుబలి సినిమాలో నటిస్తున్నాడు. అడవి శేష్ ‘కిస్’ సినిమాకి పోటీగా అదే రోజున మంచు మనోజ్ నటించిన ‘పోటుగాడు’ సినిమా కూడా విడుదల కానుంది.