శరవేగంగా సాగుతున్న కార్తికేయ చిత్ర చిత్రీకరణ

Nikhil-and-Swathii
సినిమా విజయం సాధించింది అంటే ఆ హీరో, హీరోయిన్ల కాంబినేషన్ ను కొనసాగించడం మనకు కొత్తేం కాదు. అలంటి ఒక కాంబినేషన్ లో ఒక జంట నిఖిల్ మరియు స్వాతి. వీరిద్దరూ నటించిన ‘స్వామి రారా’ సినిమా మంచి విజయం సాధించడంతో మరోసారి ఈ జంట ‘కార్తికేయ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో చందూ మొండేటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కామెడి థ్రిల్లర్ తరహాలో సాగే ఈ సినిమా కధను కొద్దిగా రివీల్ చేసారు. “మెడికల్ విద్యార్ధులైన హీరో, హీరోయిన్ లలో హీరో శైలి ప్రత్యేకం. ప్రపంచంలో సమాధానం లేని ప్రశ్న లేదంటాడు. ఒకవేళ సమాధానం దొరకకపోతే అతి మనం పడ్డ కష్టంలోనే తప్పుందని తెలిపే ధోరణి. ఈ ప్రయాణంలో సాగే సన్నివేశాలను అందంగా తెరకెక్కించారు”. ఇప్పటికే రెండు షెడ్యూల్లలో కొన్ని సన్నివేశాలను రెండు పాటల షూటింగ్ ని ఈ సినిమా ముగించుకుంది . శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకానుంది

Exit mobile version