ఎన్.టి.ఆర్ సినిమా కోసం రెజీనా పేరు పరిశీలన


ఇప్పుడిప్పుడే కథానాయికగా అడుగులేస్తున్న రెజీనా ఇప్పటికే తన నటనకి మంచి మార్కులు కొట్టేసారు. ప్రస్తుతం ఈ భామని ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఒక ప్రముఖ పాత్ర కోసం పరిశీలిస్తున్నారని సమాచారం. కానీ అది ఇంకా ఖరారు కాలేదు ఇంకా చర్చల స్టేజ్ లోనే ఉంది. ప్రతి పెద్ద సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో పలువురి హీరోయిన్స్ ని పరిశీలించడం కామన్ విషయమే మరియు ఈ విషయంపై ఖచ్చితమైన సమాచారం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

దిల్ రాజు నిర్మించనున్న ఈ కొత్త సినిమా 2013 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్నాడు.

రెజీనా ఎన్.టి.ఆర్ సరసన సెట్ అవుతుందా? మీరేమంటారు ఫెండ్స్? మీ సమాధానాల్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.

Exit mobile version