డైరెక్టర్ అయ్యే అవకాశాలున్నాయి.. చూద్దాం అంటున్న రవితేజ

మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా రేపు 9న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు రవితేజ. ఇంకా చేతిలో పలు సినిమాలున్నాయి. ఈ ఏడాదిలో కొత్తగా ఇంకో రెండు సీనియాలను ప్రకటిస్తారట కూడ. అయితే ఇన్నాళ్లు నటుడిగా, హీరోగా సత్తా చూపిన ఆయన భవిష్యత్తులో దర్శకుడిగా మారాలనుకుంటున్నారు.

రవితేజ ఇండస్ట్రీలోకి వచ్చిందే సహాయ దర్శకుడిగా. దర్శకత్వ విభాగం గురించి ఆయనకు బాగా తెలుసు. దర్శకుడి బరువు బాధ్యతలు ఏంటో దగ్గరుండి చూసిన వారు. తాజాగా ‘క్రాక్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రవితేజలోని స్పెషల్ టాలెంట్ ఏమిటని అడిగితే భవిష్యత్తులో ఆయన సినిమా దర్శకుడిగా మారొచ్చని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. పక్కనే ఉన్న రవితేజ సైతం అవకాశాలున్నాయి. చూద్దాం అంటూ సమాధానం ఇచ్చారు. దీన్నిబట్టి ఆయన మనసులో దర్శకత్వం చేయాలనే కోరిక ఉందని అర్థమవుతోంది. మరి ఆ కోరికను ఆయన ఎప్పుడు, ఎలా, ఏ సినిమా ద్వారా నెరవేర్చుకుంటారో చూడాలి.

Exit mobile version