ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తన ఆల్ టైం హిట్ కాంబో అయినటువంటి దర్శకుడు గోపీచంద్ మలినేని అలాగే శృతి హాసన్ లతో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ “క్రాక్”. దీనికి ముందు రవితేజకు సరైన హిట్ లేకపోయినప్పటికీ ఈ చిత్రంపై మాత్రం మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా పట్ల మాత్రం మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
ఇప్పటి వరకు వచ్చిన అవుట్ ఫుట్ ప్రతీ అంశంలో చాలా నమ్మకంగా ఉన్నారట. ఇక అలాగే కొన్ని కీలక సీన్స్ లో రవితేజ పెర్ఫామెన్స్ అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది అని అంతే కాకుండా రవితేజ ఫ్యాన్స్ కు మరియు మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ బాగా దట్టించినట్టుగా తెలుస్తుంది.
దీనితో క్రాక్ సినిమాతో మంచి బ్రేక్ అందుకొని రవితేజ ట్రాక్ లో పడడం ఖాయం అనే టాక్. అందరి హీరోల అభిమానులూ కలిసి ఓ హీరో సినిమా హిట్టవ్వాలని కోరుకున్నారు అంటే అది రవితేజాదే అని చెప్పాలి. మరి ఈ సంక్రాంతికి రవితేజ సాలిడ్ కం బ్యాక్ ఇస్తారా లేదా అన్నది చూడాలి.