మాస్ మహారాజ రవితేజ ఈ పేరు వినగానే మొట్ట మొదటగా అతని స్వయం కృషే గుర్తుకు వస్తుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత స్థాయికి ఎదిగి నిలబడ్డాడు. అందుకే ప్రతీ ఒక్క హీరో అభిమాని కూడా రవితేజ అంటే అపారమైన గౌరవం ఇస్తారు తాను చేసిన ప్రతీ సినిమా కూడా హిట్టవ్వాలని మనసారా కోరుకుంటారు. కానీ ఇప్పుడు రవితేజాకు మాత్రం నడుస్తున్న టైం చూసి చాలా బాధ పడుతున్నారు.
గత చిత్రం “డిస్కో రాజా” ఫ్లాప్ కావడం. అది ప్లాప్ అయినా సరే దాని తర్వాత టేకప్ చేసిన “క్రాక్”తో స్యూర్ షాట్ హిట్ అందుకోవడం కన్ఫర్మ్ అయ్యింది. ఈ సంక్రాంతి మాస్ మహారాజ్ సినిమాతోనే మొదలు అవుతుంది అనుకునే సరికి ఒక్కసారిగా మొత్తం అంతా చివరి నిమిషంలో మారిపోయింది. నిర్మాతలకు చివరి నిమిషంలో ఏవో సమస్యలు ఎదురయ్యేసరికి థియేటర్స్ లో సినిమా ఆగిపోయింది. దీనితో ఈ సమయాన్ని బలంగా తీసుకుంటున్నారు రవితేజ అభిమానులు.
అలాగే ఈ విషయంలో రవితేజానే తమకు స్ఫూర్తి అన్నట్టుగా ఈ అడ్డంకును ఎదుర్కొని నిలబడ్డారు. రవితేజ ఇప్పటి వరకు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో తెలిసిందే. మరి వాటన్నిటిని గుర్తు చేసుకొనే ఇదెంత అని ఈ కష్టతర సమయాన్ని తీసుకోగలిగారు. అలాగే ఈ జాబితాలో ఇతర హీరోల అభిమానులు కూడా అందరు చెయ్యి కలపడం మరింత స్ఫూర్తిదాయకం. ఈ చిత్రం విడుదల పలుమార్లు డిలే కావడంతో అందరి హీరోల అభిమానులు కూడా రవితేజాతో ఉన్నామని సోషల్ మీడియా చెబుతున్నారు.