‘సారొచ్చారు’ రవితేజ కెరీర్ హైయెస్ట్


రవితేజ లేటెస్ట్ సినిమా ‘సారొచ్చారు’ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్లో హైయెస్ట్ రేటుకి అమ్ముడుపోయింది. ఈ సినిమాని రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ రేటు పెట్టి కొన్నట్లు సమాచారం. 100% లవ్, శ్రీ రామరాజ్యం, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాలను పంపిణీ చేసిన బ్లూ స్కై వారు ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. రవితేజ మిరపకాయ్ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో బంపర్ కలెక్షన్స్ వసూలు చేసింది. సారొచ్చారు సినిమాలో రవితేజకి జోడీగా కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు. పరుశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పరశురాం, రవితేజ కాంబినేషన్లో గతంలో ఆంజనేయులు సినిమా వచ్చింది. వైజయంతి బ్యానర్లో అశ్విని దత్ సమర్పిస్తున్న ఈ సినిమాని త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మిస్తుంది. నవంబర్ 30న ఆడియో విడుదల చేసి డిసెంబర్ 21న సినిమాని విడుదల చేయబోతున్నారు.

Exit mobile version