ఈ సంవత్సరంలో రవితేజ ఫస్ట్ ప్లేస్

అవును రవితేజ ఈ సంవత్సరం మొదటి స్థానంలో నిలిచాడు. 2012 సంవత్సరంలో ఇప్పటి వరకు రవితేజ నటిచిన సినిమాలు గమనిస్తే గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ‘నిప్పు’ ఫిబ్రవరిలో విడుదల కాగా, శివ డైరెక్షన్లో వచ్చిన ‘దరువు’ మే నెలలో విడుదలైంది. తన ఆత్మీయ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్లో చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ ఆగష్టు లో విడుదల కాగా దీంతో మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరంలోనే రవితేజ నటించిన మరో సినిమా విడుదల కాబోతుంది. పరశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సారొచ్చారు’ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నారు. 2012 సంవత్సరంలో నాలుగు సినిమాలు చేసిన హీరోగా రవితేజ మొదటి స్థానంలో నిలిచాడు. ఇవే కాకుండా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ‘బలుపు’, ‘జింతాత జిత జిత’ అనే మరో రెండు సినిమాలు కూడా అంగీకరించాడు.

Exit mobile version