మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కిస్తుండగా పూర్తి మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
అయితే, ఈ సినిమా తర్వాత రవితేజ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను జూన్ నెలలో అఫీషియల్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
ఇలాంటి వెరైటీ టైటిల్‌తో రవితేజ తన నెక్స్ట్ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నారు.