తమిళంలోకి రవితేజ “వీర”

తమిళంలోకి రవితేజ “వీర”

Published on Jul 31, 2012 1:34 AM IST


రవితేజ,కాజల్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “వీర” ఇప్పుడు తమిళంలోకి అనువదించబడుతుంది.ఈ చిత్రానికి “వీరయ్య” అనే పేరు పెట్టారు. తెలుగులో గత సంవత్సరం విడుదలయ్యి పరాజయం పొందినా ఈ చిత్రంలో కాజల్ మరియు తాప్సీ లాంటి తారలు తమిళనాడులో పేరొందడం మూలాన ఈ చిత్రం డబ్బింగ్ హక్కులను ఒక తమిళ నిర్మాత కొనుక్కున్నారు. ఈ చిత్రం అక్కడ ఆగస్ట్ 3న విడుదల కానుంది. త్వరలో కాజల్ సూర్య “మాట్రన్” చిత్రంలోనూ తాప్సీ అజిత్ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా రవితేజ నేరుగా తమిళ చిత్రం ఒక్కటి కూడా చెయ్యలేదు. ఆయన అనటించిన “కిక్” మరియు “విక్రమార్కుడు” తమిళంలో రీమేక్ చేశారు.

తాజా వార్తలు