ఈ నెలాఖరు నుంచి రవితేజ కొత్త మూవీ

ఈ నెలాఖరు నుంచి రవితేజ కొత్త మూవీ

Published on Sep 2, 2013 5:30 PM IST

Raviteja
మాస్ మహారాజ రవితేజ ‘బలుపు’ తో హిట్ అందుకున్న తరువాత షూటింగ్ కి కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం తను ఓ కొత్త సినిమాకి సైన్ చేసాడు. ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరబాద్ లో జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుండి మొదలు కానుంది.

అందరికీ తెలిసిన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి నిర్మించనున్న ఈ సినిమా ద్వారా బాబీ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. బాబీ ‘బలుపు’ సినిమాకి కథని అందించాడు. ఈ కొత్త సినిమా కూడా కామెడీ ఉండే మాస్ ఎంటర్టైనర్ అని ఆశిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ తన సినిమా కథలపై కేర్ తీసుకుంటున్నాడు, అందుకే ఈ మధ్య త్వరత్వరగా కథలు ఒప్పుకోవడం లేదు.

తాజా వార్తలు