‘వీర’ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేసిన మాస్ మహారాజ రవితేజ ‘సారొచ్చారు’ సినిమాలో మరోసారి రవితేజతో రోమాన్స్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వీరిద్దరి మధ్య బ్యూటిఫుల్ రొమాంటిక్ ట్రాక్ ఉందని, అదే సినిమాలో హైలైట్ కానుందని అంటున్నారు. రొమాంటిక్ ట్రాక్స్ తీయడంలో డైరెక్టర్ పరశురాంకి మంచి పేరుంది. ఈ సినిమాలో రవితేజ సరికొత్త అవతారంలో కోచ్ గా కనిపిస్తున్నాడు. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.