ఓటిటి సమీక్ష: ‘ఏనుగు తొండం ఘటికాచలం’ – ఒరిజినల్ చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘ఏనుగు తొండం ఘటికాచలం’ – ఒరిజినల్ చిత్రం ఈటీవీ విన్ లో

Published on Nov 14, 2025 2:30 PM IST

Yenugu-Thondam-Ghatikachala movie review

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : నవంబర్ 13, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : నరేష్, రవిబాబు, ఆలీ, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, గిరిధర్, విజయ భాస్కర్, వర్షిణి, ప్రశాంతి, శిరీష జూనియర్ రేలంగి తదితరులు
దర్శకత్వం : రవిబాబు
నిర్మాత : రవిబాబు
సంగీతం : ఎస్ ఎస్ రాజేష్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో నేరుగా రిలీజ్ కి వచ్చిన కామెడీ చిత్రం ‘ఏనుగు తొండం ఘటికాచలం’ కూడా ఒకటి. దర్శకుడు రవిబాబు నుంచి చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

సుమారు 65 ఏళ్ళకి దగ్గరకి వస్తున్న ఏనుగు తొండం ఘటికాచలం (నరేష్) రిటైర్ అయ్యాక తన పిల్లలు కోడళ్ళుతో కలిసి ఉంటారు. తమ ఇంట్లోనే పని మనిషి భవాని (వర్షిణి సౌందరాజన్) కూడా ఉంటుంది. అయితే ఘటికాచలం పెన్షన్ డబ్బుతోనే తన కొడుకులు కోడళ్ళు తనని సరిగ్గా చూసుకోకుండానే నెట్టుకొస్తారు. ఈ సమయంలో భవాని, ఘటికాచలంని మభ్యపెట్టి తనతో పెళ్లి జరిపించుకుంటుంది. ఇక అక్కడ నుంచి అకస్మాత్తుగా చనిపోయిన ఘటికాచలం వల్ల వీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? వీరంతా కలిసి ఘటికాచలం విషయంలో చేసిన ప్లాన్ ఏంటి? చివరికి వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా? ఘటికాచలం ఎలా చనిపోయారు లాంటివి మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం రవిబాబు సినిమాలు అంటే బాగా ఇష్టం తన బ్రాండ్ నుంచి మినిమమ్ ఆశించేవారికి కొంతమేర ఓకే అనిపిస్తుంది. తన మార్క్ టైటిల్ కార్డ్స్, అక్కడక్కడా తన మార్క్ కామెడీ సీన్స్ అలాగే ట్విస్ట్ లు ఇంకా క్లైమాక్స్ పోర్షన్ లో ఎమోషన్స్ పర్వాలేదు అనిపిస్తాయి.

అలాగే తన పాత సినిమాలు ఐడియా ఉన్నవారికి స్క్రీన్ ప్లే ఓకే అనిపించవచ్చు. ఇక వీటితో పాటుగా లీడ్ నటీనటులు ఇందులో తమ పాత్రలు పరిధి మేరకు బానే చేశారు. సీనియర్ నటుడు నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ అలానే వర్షిణి ఇంకా గిరిధర్, విజయ్ భాస్కర్ తదితరులు తమ రోల్స్ తగ్గట్టుగా నటించారు.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు రవిబాబు తన మార్క్ కామెడీ ఇంకా థ్రిల్లర్ చిత్రాలతో మంచి బెంచ్ మార్క్ ని సెట్ చేసుకున్నారు. ఇప్పుడు అంటే ఎన్నో కామెడీ ఇంకా థ్రిల్లర్ రావచ్చు కానీ అలాంటి వాటిని ఎప్పుడో తాను టచ్ చేశారు. అలాంటి దర్శకుడు నుంచి మళ్ళీ సినిమా అంటే తన వర్క్ మీద రెస్పెక్ట్ ఉన్న వారిలో మినిమమ్ అంచనాలు అయినా ఉంటాయి.

కానీ నిరాశ కలిగించే విధంగా ఈ చిత్రం వారిని కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఉండదు. రవిబాబు గత చిత్రాలు అల్లరి వరకు కాకపోయినా మనసారా, నువ్విలా లాంటి సినిమాల్లో కామెడీ ఎంతో నాచురల్ గా బాగా నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. అంతెందుకు క్రష్ సినిమాలో కూడా మంచి ఫన్ ఉంటుంది.

దానితో ఫామ్ లోకి వచ్చారు అనుకుంటే ఈ సినిమా మాత్రం మళ్ళీ నిరాశగానే అనిపిస్తుంది. సినిమాలో చాలా తక్కువ చోట్ల తప్పితే మిగతా ఎక్కడా అంతగా ఫన్ జెనరేట్ కాలేదు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న సీనియర్ కమెడియన్స్ ఇందులో ఉన్నప్పటికీ వారితో నడిచే సీన్స్ ఏమంత నవ్వు తెప్పించే విధంగా లేవు. అలాగే కథనం దాదాపు ఊహాజనితంగానే సాగుతుంది. ఈ కారణం చేత సినిమాలో పరిస్థితులు మరింత చప్పగా అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. కొన్ని సీన్స్ లో వి ఎఫ్ ఎక్స్ సింపుల్ గా తెలిసిపోయేలా ఉన్నాయి. మ్యూజిక్ ఓకే, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు రవిబాబు విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి కొంతమేరకు మాత్రమే ఓకే అనిపిస్తుంది. తన మార్క్ స్పార్క్ ఈ సినిమాలో బాగా మిస్ అయ్యింది. రొటీన్ అండ్ రెగ్యులర్ గా సాగే కథనం, దాదాపు నవ్వు తెప్పించని సన్నివేశాలు సినిమాకి ఆకట్టుకునే దిశగా తీసుకెళ్లలేదు. క్రష్ సినిమాతో ఫామ్ లోకి వచ్చారు అనుకున్న రవిబాబు నుంచి ఈ చిత్రం మాత్రం నిరాశే మిగులుస్తుంది. తాను మరింత బెటర్ వెర్షన్ ని ఈ సినిమాకి ట్రై చేయాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ఏనుగు తొండం ఘటికాచలం’ పూర్తి స్థాయిలో ఆకట్టుకోని కామెడీ డ్రామాగా నిలిచింది. దర్శకుడు రవిబాబు తాలూకా గత సినిమాలు తన క్రియేటివిటీ కోసం మినిమమ్ ఐడియా ఉన్నవారికి కూడా ఈ సినిమా నిరుత్సాహాన్నే మిగులుస్తుంది. ఇక ఏ అంచనాలు లేని ఆడియెన్స్ అయితే కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. సో ఈ చిత్రం కేవలం రవిబాబు సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు కొత్త సినిమా చూడాలి అనుకునే వారినే చాలా తక్కువ స్థాయిలో ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు