‘అల్లరి’ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి పరిచయమై ఆ అల్లరినే ఇంటిపేరుగా మార్చుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరోసారి తన ఇండస్ట్రీకి పరిచయం చేసిన రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. తన సినిమాలకు రొటీన్ కి భిన్నంగా టైటిల్స్ ఎంచుకునే రవిబాబు ఈ సినిమాకి ‘లడ్డూబాబు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో ఒకప్పుడు టాప్ హీరోల సరసన నటించిన భూమిక ఓ కీలక పాత్రలో కనిపించనుంది. చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని త్రిపురనేని రాజేంద్ర నిర్మిస్తున్నాడు. కామెడీని తెరపై ఆవిష్కరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న రవిబాబు – కామెడీ కింగ్ గా పేరుతెచ్చుకున్న అల్లరి నరేష్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందా అని నరేష్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.