రష్మికను ఫిదా చేసిన బేబీ గర్ల్.

రష్మికను ఫిదా చేసిన బేబీ గర్ల్.

Published on Jun 28, 2020 1:27 PM IST

హీరోయిన్ రష్మిక ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన లేటెస్ట్ హిట్ భీష్మ మూవీలోని హిట్ సాంగ్ వాట్ ఏ బ్యూటీ సాంగ్ కి ఓ క్యూట్ బేబీ డాన్స్ వేస్తున్న వీడియో తను షేర్ చేసింది. భీష్మ మూవీలో రష్మిక ఆ పాటకు మాస్ స్టెప్స్ తో వేసి అలరించింది. ఓ చిన్న పాప ఆ పాటకు డాన్స్ వేయడం రష్మికకు చాలా హ్యాపీగా ఫీలై ఆ వీడియో పంచుకున్నారు.

ఇక రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మరియు బీష్మతో మంచి హిట్స్ అందుకున్న ఆమె ప్రస్తుతం సుకుమార్ బన్నీల భారీ ప్రాజెక్ట్ పుష్ప లో హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. తమిళ్ లో కూడా స్టార్ హీరోల పక్కన ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

తాజా వార్తలు