రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో యువ నటుడు దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన రీసెంట్ సినిమానే “ది గర్ల్ ఫ్రెండ్”. మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకొని హిట్ అయ్యింది. మెయిన్ గా టాక్సిక్ రిలేషన్ షిప్ లపై వచ్చిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా థియేటర్లు నుంచి ఓటీటీ లోకి అందుబాటులో వచ్చేసింది. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా వచ్చేసింది. సో ఇప్పుడు చూడాలి అనుకునే వారు ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ సమర్పణలో సినిమా విడుదల అయ్యింది.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
