స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మెయిన్ లీడ్ లో దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన లవ్ స్టోరీ చిత్రమే “ది గర్ల్ ఫ్రెండ్”. ప్రెజెంట్ జెనరేషన్ లో ఉన్నటువంటి టాక్సిక్ రిలేషన్ షిప్ లో డార్క్ కోణాన్ని చూపించిన ఈ సినిమా యువతని ఆకట్టుకుంటుంది. ఇలా మొదటి రోజు కంటే నాలుగో రోజే బెటర్ గా పెర్ఫామ్ చేసే రేంజ్ కి ఈ సినిమా వచ్చింది.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమా పెట్టుకున్న టార్గెట్ ని కొట్టేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కేవలం ఈ 5 రోజుల్లోనే రష్మిక సినిమా బ్రేకీవెన్ కొట్టేసిందట. దీనితో ది గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు లాభాల్లోకి వెళుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి హీశం అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించగా విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని నిర్మాణం వహించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా రిలీజ్ కి వచ్చింది.


