‘పెద్ది’లో కూడా రంగస్థలం లాంటి మాస్ నెంబర్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇలా మేకర్స్ రీసెంట్ గానే ఒక క్రేజీ యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేయగా ఇప్పుడో కొత్త రూమర్ వినిపిస్తుంది.

రామ్ చరణ్ కెరీర్లో భారీ అయ్యిన సినిమాల్లో ఒకటి రంగస్థలం. ఆ సినిమాలో ఐటెం సాంగ్ లాంటి ఓ మాస్ నెంబర్ షూట్ కూడా ఇపుడు కంప్లీట్ చేసినట్టు ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కేవలం కొన్ని రోజులు కితమే ఫైట్ సీన్, ఇప్పుడు ఐటెం సాంగ్ ని కంప్లీట్ చేసేసారు అంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రం గ్రాండ్ గా మార్చ్ 27న విడుదల కాబోతుంది.

Exit mobile version