ప్రభాస్ తమ్ముడిగా నటించనున్న రానా

Prabhas-And-Rana
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రానున్న “బాహుబలి” చిత్రంలో ప్రభాస్ కి తమ్ముడిగా యువ కథానాయకుడు రానా నటించనున్నారు. ఈ విషయాన్నీ ఈరోజు రానా తన ట్విట్టర్ ఎకౌంటులో దృవీకరించారు. “అవును నేను రాజమౌళి దర్శకత్వంలో రానున్న చిత్రంలో ప్రభాస్ తమ్ముడిగా కనిపించానున్నాను నాది అందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర ఈ చిత్రాన్ని కె రాఘవేంద్ర రావు గారు లేదా శోభు నిర్మించనున్నారు” అని అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే “బాహుబలి” చిత్రం అన్నదమ్ముల మధ్య జరిగే యుద్దంలా కనిపిస్తుంది. గతంలో రాజమౌళి “ఛత్రపతి” చిత్రం ఇదే రకమయిన కాన్సెప్ట్ తో నడుస్తుంది ఈ చిత్రం ఈ ఏడాదే మొదలు కానుంది.

Exit mobile version