‘లీడర్’ సినిమాతో తెలుగులో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన రానాకు తెలుగులో కమర్షియల్ హిట్ సాధించడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలకోసం కండలు పెంచుతున్నఈ హీరో ఒక కొత్త ప్రాజెక్ట్ ను అంగీకరించాడని తెలుస్తుంది. ‘అందాలరాక్షసి’ సినిమాను తీసిన హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు. ‘కవచం’ అనేది ఈ సినిమా టైటిల్ గా అనుకుంటున్నారు. ‘అందాలరాక్షసి’ సినిమా విజయం సాధించకపోయినా హనుకు మంచి మార్కులే వచ్చాయి. నిర్మాత మరియు తారల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. కాంబినేషన్ పరంగా బాగానే వున్నా హను మరియు రానా ఒకరికొకరు కమర్షియల్ హిట్ ను ఇచ్చుకోగాలరో లేదో చూడాలి.