టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుపాటి ఇటీవలే ‘కృష్ణం వందే జగద్గురుం’ షూటింగ్లో గాయపడ్డ విషయం తెలిసిందే. డాక్టర్ల కోరిక మేరకు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న రానా మళ్లీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి విమర్శకులు మెచ్చే దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. రానా ఈ సినిమాలో బీటెక్ బాబు అనే పాత్ర పోషిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జాగర్లమూడి సాయి నిర్మిస్తున్నారు.