ఒంగోలు గిత్తలో ఫుల్ మాస్ గా కనిపించనున్న రామ్


తన కో -స్టార్స్ మరియు దర్శకులను ఆశ్చర్యపరచడంలో రామ్ ఎప్పుడు ఒక అడుగు ముందుంటాడు “దేవదాస్” వంటి రొమాంటిక్ చిత్రంతో తెరకు పరిచయమయిన రామ్ తరువాత “డీ”,”గణేష్” మరియు “ఎందుకంటే ప్రేమంట” వంటి చిత్రాలలో తన రొమాంటిక్ రోల్స్ ని కొనసాగించాడు కాని ఈ మధ్య వచ్చిన “కందిరీగ” చిత్రంతో మాస్ వైపు తన అడుగులు వేయడం మొదలు పెట్టారు. భాస్కర్ దర్శకత్వంలో రానున్న “ఒంగోలు గిత్త” చిత్రంలో ఫుల్ మాస్ గా కనిపించనున్నారు ఈరోజు విడుదలయిన టీజర్ చూస్తుంటే ఈ విషయం అర్ధం అవుతుంది. ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం రాబోయే కాలంలో మరింత క్రేజ్ సంపాదించుకోనుంది. కృతి కర్బంధ కథానాయికగా నటిస్తుండగా BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. జి.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది త్వరలో విడుదల అవుతుంది.

Exit mobile version