ఫోటో మూమెంట్ : ‘నువ్వుంటే చాలే’ సాంగ్ హిట్టు.. పార్టీ చేసుకున్న టీమ్..!

ఫోటో మూమెంట్ : ‘నువ్వుంటే చాలే’ సాంగ్ హిట్టు.. పార్టీ చేసుకున్న టీమ్..!

Published on Jul 20, 2025 12:30 AM IST

Ram-Pothineni

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా నుంచి రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘నువ్వుంటే చాలే’ అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను రామ్ స్వయంగా రాయడం విశేషం. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ పాటను ఆలపించగా మ్యూజిక్ ద్వయం వివేక్-మెర్విన్ ఈ పాటను కంపోజ్ చేశారు. పూర్తి రొమాంటిక్ మెలోడి సాంగ్‌గా ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాట ప్రేక్షకులను మెప్పించడంతో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ పాటకు వచ్చిన సూపర్ రెస్పాన్స్‌తో ఈ చిత్ర టీమ్ తాజాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్‌తో పాటు దర్శకుడు మహేష్ బాబు, వివేక్-మెర్విన్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోండగా ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు