పండగచేస్కోమంటున్న రామ్ – గొపీచంద్

పండగచేస్కోమంటున్న రామ్ – గొపీచంద్

Published on Feb 17, 2014 10:32 PM IST

ram-gpoi-chand

ఎనర్జటిక్ హీరో రామ్ మరియు సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలిసి చేయనున్న విషయం తెలిసినదే. ఈ సినిమాకు ‘పండగ చేస్కో’ అనే టైటిల్ ఖరారయింది. వచ్చే నెలనుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ వార్తను ద్రువీకరించడం కోసం మేము దర్శకుడితో మాట్లాడాం

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రామ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. హీరోయిన్ మొదలగు విషయాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమాను పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం రామ్ చాలా డల్ ఫేజ్ లో వున్నాడు

గోపీచంద్ రవితేజ కి కూడా ఇదే స్టేజ్ లో వున్నప్పుడు బలుపుతో హిట్ రుచి చూపించాడు. మరి అలాగే రామ్ కి కూడా ఇటువంటి హిట్ ఇవ్వాలని కోరుకుందాం

తాజా వార్తలు