రాంగోపాల్ వర్మ ‘షో మ్యాన్’గా నటిస్తున్న కొత్త చిత్రం ప్రారంభం

RGV

దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) టైటిల్ పాత్ర పోషిస్తున్న కొత్త చిత్రం “షో మ్యాన్”. దీనికి “మ్యాడ్ మాన్స్టర్” అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుమన్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. సుమన్ విలన్‌గా నటించిన రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ‘నూతన్’ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నారు.

ఆర్జీవీకి అత్యంత ఇష్టమైన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో ఈ సినిమా ఇటీవల షూటింగ్‌ను సైలెంట్‌గా ప్రారంభించింది. ‘ఐస్ క్రీమ్ 1, 2’ వంటి చిత్రాలను నిర్మించి, ఆర్జీవీతో ప్రత్యేక అనుబంధం ఉన్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై దీనిని ప్రొడక్షన్ 120గా రూపొందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం నూతన్ అందిస్తున్నారు.

Exit mobile version