ఆ సినిమా పేరు అది కాదంటున్న యంగ్ హీరో

ram

రామ్ త్వరలో ‘బోల్ బచ్చన్’ రీమేక్ షూటింగ్లో పాల్గొనున్నాడు. ఈ యాక్షన్ కామెడీలో రామ్ మరియు వెంకటేష్ కలిసి మనల్ని అలరించనున్నాడు. ఈ సినిమాని డి. సురేష్ బాబు మరియు స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకి విజయ భాస్కర్ దర్శకుడు. ఈ సినిమా అధికారికంగా ఈ మధ్యనే మొదలుకాగా అప్పుడే టైటిల్ మీద చాలా రూమర్స్ వచ్చేసాయి. ఒక కధనం ప్రకారం ఈ సినిమాకి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే పేరుని ఖరారు చేసేసారు అని వార్తలు వచ్చేసాయి. కాకపోతే రామ్ ఈ వార్తని ఖండించాడు. “మా సినిమా టైటిల్ పేరు సర్వేజనా సుఖినోభవంతు కాదు… త్వరలోనే మీకు వెల్లడిస్తాం… ప్రేమతో” అని ట్వీట్ చేసాడు. అతను మొదటిసారిగా క్లీన్ షేవ్ తో కనబడనున్నాడు. వీరిద్దరి సరసన హీరోయిన్స్ ను అన్వేషిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.

Exit mobile version