బాలీవుడ్ లో రామ్ చరణ్ నటిస్తున్న మొదటి చిత్రం ‘జంజీర్’ కొద్దికొద్దిగా ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ సినిమా ఫైనల్ కట్ సిద్ధమైంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యకరమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అమిత్ మెహ్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు అపూర్వ లిఖియా దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను పంపిణీ చేస్తుంది. ‘ముంబైకి హీరో ‘ అంటూ సాగే ఒక పాటను ఆగష్టు 7న విడుదల చెయ్యనున్నారు. ఈ పాటను రామ్ చరణ్, ప్రియాంక చోప్రాల నడుమ చిత్రీకరించారు. సినిమా సెప్టెంబర్ 6న విడుదల చేస్తామని తెలిపిన దగ్గరనుండీ చిత్రబృందమంతా ప్రచారంపై దృష్టిసారించింది. ఆయిల్ మాఫియా నేపధ్యంలో సాగే ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక ముఖ్య పాత్రను పోషించాడు. తెలుగులో సంజయ్ దత్ పాత్రను శ్రీ హరి భర్తీ చేసాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్. ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు వెర్షన్ యోగి పర్యవేక్షణలో జరుగుతుంది. ఆనంద్ రాజ్ ఆనంద్, మీట్ బ్రోస్ అంజ్జన్ మరియు చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. గురురాజ్ జియోస్ సినిమాటోగ్రాఫర్