శర్వా ఆడియో వేడుకకి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్

రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓఅక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ నిర్మాతగా మారి చేస్తున్న తొలి సినిమా ‘కో అంటే కోటి’. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు శ్రీహరి, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆడియో వేడుక డిసెంబర్ 8న హైదరాబాద్లోని హైటెక్స్ లో జరగనుంది. ఈ వేడుకకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా దగ్గుబాటి ముఖ్య అతిధులుగా రానున్నారు. వీరితో పాటు అల్లు అర్జున్, మరికొంతమంది యంగ్ హీరోలు హాజరయ్యే అవకాశం ఉంది. అనిష్ కురివిల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాని డిసెంబర్లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version