మాస్ మహారాజ్ “క్రాక్” చరణ్ కు ఓ రేంజ్ లో నచ్చిందట.!

మాస్ మహారాజ్ “క్రాక్” చరణ్ కు ఓ రేంజ్ లో నచ్చిందట.!

Published on Jan 13, 2021 4:00 PM IST

ఈ సంక్రాంతి కానుకగా తానే మొట్ట మొదట బరిలోకి దిగిన మాస్ మహారాజ్ తన “క్రాక్” చిత్రంతో సాలిడ్ కం బ్యాక్ అందుకోవడం మాత్రమే కాకుండా మాస్ ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలకు తన కం బ్యాక్ రుచి చూపించారు. తన హిట్ కాంబో గోపీచంద్ మలినేని, శృతి హాసన్ మరియు థమన్ ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది.

తన కం బ్యాక్ కు మాస్ బిర్యానీ పెట్టిన మాస్ మహారాజ్. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా పెట్టాడట. చరణ్ ఈ చిత్రాన్ని చూసి సూపర్బ్ గా ఎంజాయ్ చేసానని అంతే కాకుండా నా ఫేవరెట్ రవితేజ గారు ఫామ్ లోకి వచ్చారని శృతి హాసన్ బెస్ట్ ఇచ్చింది అని వారిపై తన ప్రేమను చూపించారు.

అలాగే నటులు సముథ్రఖని మరియు వరలక్ష్మి తమ రోల్స్ ను ఈజ్ గా చేసారని అలాగే థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాను మరింత స్థాయికి తీసుకెళ్లింది అని ఫైనల్ గా ఇలాంటి సినిమా ఇచ్చిన గోపీచంద్ కు మొత్తం టీం కు కంగ్రాట్స్ చెప్పారు. మొత్తానికి మాత్రం మాస్ మహారాజ్ మాస్ బిర్యానీకి చరణ్ కు ఓ రేంజ్ లో నచ్చినట్టు ఉందని చెప్పాలి.

తాజా వార్తలు